శాస్త్రి కృషితో భారత్ జట్టు మరింత ముందుకు :గంగూలీ

SMTV Desk 2017-08-03 14:23:48  Ganguly , ravi sasthry, Team India, BCCI

ముంబై, ఆగష్టు 3: క్రికెట్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు, మాజీ కెప్టెన్ గంగూలీ మాట్లాడుతూ భారత్ ప్రధాన కోచ్ రవిశాస్త్రి శిక్షణలో టీమిండియా వరల్డ్ కప్ సాధిస్తుందనే నమ్మకం ఆయనకు ఉందని తెలియజేసారు. అయితే రవిశాస్త్రి మరింత రాటుదేలాలని గంగూలీ సూచించడం గమనార్హం. ఈ సందర్భంగా ఆయనకు గంగూలీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. శాస్త్రి కోచింగ్ తో భారత జట్టును మరింత ముందుకు వెళుతుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న భారత్ టీమ్ అత్యుత్తమమైనది అంటూ, పదేపదే రవిశాస్త్రి చేస్తున్న కామెంట్లపై గురించి ఆయన మాట్లాడలేదు. మరోవైపు తన కెప్టెన్సీలో సాధించిన కొన్ని విజయాలను ఆయన జ్ఞాపకం చేసుకున్నారు. 15 సంవత్సరాల తర్వాత పాకిస్థాన్ గడ్డపై సిరీస్ గెలుచుకున్నామని 2007లో ఇంగ్లండ్‌లో ఆ జట్టుపై గెలిచామని అన్నారు. కాగా, ఈ ఆ విజయాలను రవిశాస్త్రి వ్యాఖ్యలతో పోల్చాల్సిన ఆవశ్యకత లేదన్నారు.