హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు

SMTV Desk 2019-02-21 19:53:01  

భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ అతలా-కుతలం అవుతుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కాగా వర్షాలతో పెద్ద పెద్ద బండరాళ్లు రోడ్డు మీద పడిపోవడంతో పలు మార్గాల్లో వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

ముందస్తు జాగ్రత్తగా కులు-మనాలి రోడ్డును తాత్కాలికంగా మూసి వేసారు. దానితో పాటు ఐదో నెంబర్ జాతీయ రహదారిని కూడా క్లోజ్ చేసారు. దీంతో ముందుకు వెళ్ళలేక వెనక్కి తిరిగి వచ్చే దారి లేక టూరిస్టులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ నరకం అనుభవిస్తున్నారు.

అక్కడక్కడ కొండ చేన్లు విరిగి పడటంతో రోడ్డుపై వెళ్తున్న ఓ ట్రక్ వరదలో చిక్కుకుపోయింది. వెంటనే అలర్ట్ అయిన డ్రైవర్ దిగిపోవడంతో ప్రమాదం తప్పింది. చూస్తుండగానే ట్రక్ వరదలో కొట్టుకుపోయింది. ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఎక్కువగానే జరిగే సూచనలు కనిపిస్తున్నట్లు స్థానికులు వాపోతున్నారు.