మళ్ళీ మోదీనే దేశ ప్రధాని కావాలంటున్న ప్రజలు

SMTV Desk 2019-02-21 19:41:24  

లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సందర్భంగా దేశంలో సర్వేల హడావిడి మొదలైంది. తాజాగా టైం గ్రూప్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు బయట పడ్డాయి. ఈ సర్వే ఫలితాల ప్రకారం దేశంలో మళ్ళీ మోదీ హవా కొనసాగనుంది. ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే నరేంద్ర మోదీనే ప్రధానిగా ఎన్నుకుంటామని 83.89 శాతం ప్రజలు తెలిపారు. టైమ్స్ గ్రూప్ నిర్వహించిన మెగా పోల్ లో దాదాపు 2 లక్షల మంది భారతీయులు పాల్గొన్నారు.

ఈ సర్వేలో రాహుల్‌‌కు కేవలం 8.3 శాతం ఓట్లు మాత్రమే లభించాయి. ప్రధాని అభ్యర్థిత్వం విషయమై 2018 ఫిబ్రవరిలో టైమ్స్ గ్రూప్ నిర్వహించిన ఆన్‌లైన్‌ పోల్‌లో రాహుల్ గాంధీ మూడో స్థానంలో ఉండగా, ఈ సారి రెండో స్థానంలో నిలిచారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ 1.44 శాతం ఓట్లతో మూడో స్థానంలో, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి 0.43 శాతం ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వమే అధికారంలోకి రావచ్చని 83 శాతం మంది అభిప్రాయపడ్డారు. 9.25 శాతం మంది మాత్రం కాంగ్రెస్ సారథ్యంలోని ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు.