కొలంబో టెస్ట్ లో సీరియస్ అయిన రవిశాస్త్రి

SMTV Desk 2017-08-03 13:59:39  colombo test, Rahul wicket, Ravi sasthry angry

కొలంబో, ఆగష్టు 3: ఇటీవల భారత్ పాక్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకున్న సంఘటనే నేడు కొలంబోలో శ్రీలంకతో జరుగుతున్న టెస్టులో చోటు చేసుకుంది. ఈ రోజు జరుగుతున్న రెండో టెస్ట్ లంచ్ బ్రేక్‌ తరువాత భారత ప్లేయర్ కేఎస్ రాహుల్ వృధాగా వికెట్ చేజార్చుకున్నాడు. రాహుల్ కొట్టిన షాట్ మిడాన్‌లోకి వెళ్లగా, లేని పరుగుకు ప్రయత్నించగా, అవతలి వైఫున్న పుజారా, రెండడుగులు ముందుకువచ్చిన తరువాత రన్ అవుట్ ప్రమాదాన్ని పసిగట్టి వద్దు అనే సంకేతాన్నిచ్చాడు. ఈలోగా పిచ్ మధ్య లోకి చేరిన రాహుల్, వెనక్కు వెళ్లాలా? వద్దా? అన్న సందిగ్ధంలో మూడు, నాలుగు సెకన్లు ఉండిపోగా, ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చండిమల్ బంతిని అందుకుని, దాన్ని కీపర్ డిక్‌కు వేయగా, అతను బెయిల్స్ పడగొట్టాడు. ఈ మొత్తం సీన్ పెవిలియన్ నుంచి గమనిస్తున్న రవిశాస్త్రి, కొంచెం సీరియస్ అయినట్టు వీడియోలో కనిపిస్తోంది. మొత్తం 82 బంతులాడిన రాహుల్ 7 ఫోర్ల చేసి 57 పరుగులు దగ్గర రెండో వికెట్ రూపంలో అవుట్ అవ్వడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ, పుజారాకు జత కలిశాడు. ప్రస్తుతం భారత్ 109 పరుగులతో 2 వికెట్లు నష్టపోయింది.