జంగాకి ఎమ్మెల్సీ ఇచ్చిన జగన్..

SMTV Desk 2019-02-21 19:34:03  Jaganmohan Reddy, janga krishnamurthi, mlc, vijayasai reddy, ycp

హైదరాబాద్‌, ఫిబ్రవరి 21: ఇటీవల జరిగిన బీసీ గర్జనలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. వైసీపీ బీసీ సంఘం అధ్యయన కమిటీ ఛైర్మన్‌ జంగా కృష్ణమూర్తికి ఎమ్మెల్సీ స్థానం ఇస్తానన్న జగన్ ఆ మాట నిలబెట్టుకున్నారు. ఎమ్మెల్యే కోటాలో శాసనమండలి అభ్యర్థిగా జంగా కృష్ణామూర్తిని ప్రకటించింది. ఈ నేపథ్యంలో పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి జంగాకి బీ ఫారం అందజేశారు.

కాగా జంగా కృష్ణమూర్తి ఈ నెల 25న అమరావతిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈరోజు శాసనమండలి ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలకాగా, ఫిబ్రవరి 28లోగా నామినేషన్ దాఖలు చేయాలి. కాగా మార్చి 1న నామినేషన్ల పరిశీలన, మార్చి 5న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా నోటిఫికేషన్ లో పేర్కొంది. అయితే మార్చి 12న పోలింగ్ జరగనుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుండగా, అదే రోజు ఓట్ల లెక్కింపు మరియు విజేతను కూడా ప్రకటించనున్నారు.