ప్యారడైజ్ బిర్యానీకి సరికొత్త రికార్డు..

SMTV Desk 2019-02-21 19:31:53  hyderabad, paradise biryani, limka book recor

హైదరాబాద్, ఫిబ్రవరి 21: హైదరాబాద్ లో ఫేమస్ ఏంటి అని అడిగితే అందరు బిర్యానీ అంటారు. అలాంటి హైదరాబాద్ బిర్యానీకి అరుదైన ఘనత దక్కింది. హైదరాబాద్ లో ప్యారడైజ్ బిర్యానీ బాగా ఫేమస్. ఇప్పటికే ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ గా పేరొందిన ప్యారడైజ్ బిర్యానీకి మరో రికార్డు దక్కింది. ఒక సంవత్సరంలో ఎక్కువ మంది వినియోగదారులకు బిర్యానీ అందించినందుకు గాను.. ప్యారడైజ్ బిర్యానీకి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు లభించింది.

ప్యారడైజ్ బిర్యానీని ఒక్క సంవత్సరంలో 70లక్షల మంది రుచి చూశారట. అందుకే లిమ్కా బుక్ ఆఫ్ అవార్డు సొంతం చేసుకోగలిగింది. ఈ అవార్డుతో పాటు ప్యారడైజ్ కి బెస్ట్ బిర్యానీ అవార్డు కూడా లభించింది. ఈ మేరకు ప్యారడైజ్ ఛైర్మన్ అలీ హేమతికి ఆసియా ఫుడ్ కాంగ్రెస్ సంస్థ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును ప్రకటించింది. అవార్డు పొందిన సందర్భంగా సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్ సిబ్బంది కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.