హైదరాబాద్ లో అతి పెద్ద గూగుల్ ఆఫీస్..

SMTV Desk 2019-02-21 19:26:49  google new office, hyderabad, google

హైదరాబాద్, ఫిబ్రవరి 21: ప్రముఖ సెర్చ్ ఇంజిన్ సంస్థ గూగుల్ కి ప్రపంచంలోని వివిధ పట్టణాల్లో కార్యాలయాలు ఉన్నాయి. హైదరాబాద్ లో కూడా గూగుల్ కి ఒక కార్యాలయం ఉంది. అయితే ఇప్పుడు తాజాగా మరో క్యాంపస్ నిర్మించనుంది. ఈ కార్యాలయాన్ని న‌గ‌రంలోని గ‌చ్చిబౌలి నాన‌క్‌రాంగూడ ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ట్‌లో ఏర్పాటు చేయ‌నుంది. కాగా ఇప్ప‌టికే ఈ కార్యాల‌య నిర్మాణానికి గాను అవ‌స‌ర‌మైన అనుమ‌తుల కోసం గూగుల్ ప్ర‌య‌త్నిస్తున్న‌ది.

కాగా గూగుల్ హైదరాబాద్ లో తన కొత్త కార్యాలయాన్ని 22ఫ్లోర్లతో ఒకే బ్లాక్ గా నిర్మించనుంది. మొత్తం రూ.1000 కోట్లతో ఈ క్యాంపస్ ను నిర్మించనున్నారు. అలాగే భ‌వనానికి పూర్తిగా సోలార్ విద్యుత్ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ క్ర‌మంలో మొత్తం కార్యాల‌యానికి 300 కిలోవాట్ల విద్యుత్ అవ‌స‌రం ఉంద‌ని తేల్చారు. గూగుల్ కు ఇప్ప‌టికే కొండాపూర్ లో ఓ కార్యాల‌యం ఉంది. అందులో 7వేల మంది ఉద్యోగులు ప‌నిచేస్తున్నారు.