'ఎఫ్3' లో రవితేజ ప్లేస్ లో ఇంకో హీరో!!

SMTV Desk 2019-02-21 15:52:59  

దిల్ రాజు నిర్మాణంలో ఇటీవల సంక్రాంతికి విడుదలైన ఎఫ్2 ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చినప్పటికీ ఇంకా కొన్ని చోట్ల థియేటర్లలో హవా కొనసాగిస్తూనే ఉంది. కలెక్షన్ల పరంగా ఎవరూ ఊహించని రికార్డులు సాధించింది.

వెంకటేష్, వరుణ్ తేజ్ ల కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమా, మరో వైపు ఫ్లాప్స్ లో ఉన్న మెహ్రీన్, తమన్నాలకు ప్లస్ అయ్యిందనే చెప్పాలి. ఈ సినిమాతో అనూహ్య రీతిలో సక్సెస్ సాధించిన దిల్ రాజు దీనికి సీక్వెల్ గా ఎఫ్3 ఉండబోతోందని అనౌన్స్ చేసారు.

ఏఫ్3 లో వెంకీ, వరుణ్ లతో పాటుగా ఇంకో రోల్ లో రవితేజ కూడా ఉండబోతున్నాడని అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన రాజా ది గ్రేట్ సినిమాలో లాగానే అంధుడి పాత్రలో కనిపించనున్నాడని కూడా వార్తలొచ్చాయి.

అయితే ప్రస్తుతం ఎఫ్3 లో రవితేజకు బదులు నితిన్ ను తీసుకోవాలని దిల్ రాజు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది, తన బ్యానర్లో నితిన్ కు శ్రీనివాస కళ్యాణం సినిమాతో ఫ్లాప్ ఇచ్చినందున ఎఫ్3 తో హిట్ ఇచ్చి కవర్ చేయాలని దిల్ రాజు భావిస్తున్నారట.