పాకిస్థాన్‌కు ఒకేసారి బుద్ధి చెప్పాలి: యుజవేంద్ర చాహల్

SMTV Desk 2019-02-21 15:50:25  

పుల్వామాలో జైషే ఏ మహ్మద్‌ ఉగ్రవాది జరిపిన ఆత్మాహుతి దాడి యావత్‌ ప్రపంచాన్ని కలిచివేసిన సంగతి విదితమే . ఈ ఉగ్రదాడిలో 42 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. ఈ దాడిపై దేశంలోని ప్రతీ పౌరుడి రక్తం మరిగిపోయింది. ఉగ్రదాడిని తిప్పి కొట్టాలని నినాదాలు చేశారు. ఉగ్రవాదలను మట్టుబెట్టి పాకిస్తాన్‌కు తగిన బుద్ధి చెప్పాలని యావత్ దేశం డిమాండ్ చేస్తోంది. ఈ ఘటనపై తాజాగా భారత మణికట్టు ఆటగాడు యుజవేంద్ర చాహల్ స్పందించాడు.

పాకిస్థాన్‌కు ఒకేసారి బుద్ధి చెప్పాలి. ఇంతకాలం భరించింది చాలు. ఉగ్రవాదం కారణంగా ప్రతీ మూడు నెలలకొకసారి మన జవాన్లు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు. ఈ సమస్యను ఫేస్ టూ ఫేస్ పరిష్కరించాలి. అది ఎంతపెద్ద యుద్ధమైనా సరే అని చాహల్ ఓ టీవీ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.