సారా అలీ ఖాన్ కు సైఫ్ స్ట్రాంగ్ వార్నింగ్

SMTV Desk 2019-02-21 15:49:00  

బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురైన సారా అలీఖాన్ కేదార్ నాథ్ చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యింది. అయితే ఆ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టినా, ఆ త‌ర్వాత వ‌చ్చిన సింబా చిత్రంతో తొలి హిట్ కొట్టింది. రోహిత్ శెట్టి ద‌ర్శ‌క‌త్తంలో ర‌ణ‌వీర్ సింగ్ న‌టించిన ఈ చిత్రంలో సారా త‌న‌దైన చార్మింగ్‌తో ఆక‌ట్టుకుంది.

ఇక అసలు మ్యాట‌ర్ ఏంటంటే సారా అలీఖాన్ ప్రేమాయ‌ణం సాగిస్తోంద‌ని బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. కేదార్ నాథ్ చిత్రంలో హీరోగా న‌టించిన సుషాంత్‌సింగ్ రాజ్‌పుత్‌తో సారా ప్రేమాయ‌ణం సాగిస్తోంద‌ని వార్త బీ టౌన్‌లో గుప్పుమంటుంది.

ఒక‌వైపు పుకార్లు షికార్లు కొడుతున్న.. సుషాంత్ పుట్టిన రోజున అర్థ‌రాత్రి సారా సుషాంత్ ఇంటికి వెళ్ళ‌డం, ప్రత్యేకంగా కేక్ క‌ట్ చేయించ‌డం మీడియా కంట ప‌డ‌డంతో బాలీవుడ్‌లో ఇప్పుడు ఇదో పెద్ద దుమారంగా మారింది.

దీంతో సారా ప్రేమాయ‌ణం ఇంట్లో కూడా తెలియ‌డంతో, కెరీర్ స్టార్టింగ్‌లోనే, డేటింగ్, ల‌వ్ అంటూ పిచ్చి వేషాలు వేస్తే, లైఫ్ నాశ‌నం అవుతోందని, కావాలంటే ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకున్నాక, త‌న‌కంటూ ఒక ఇమేజ్ వ‌చ్చాక ఎలాగైనా ఉండ‌మ‌ని సారాకు సైఫ్ అలీఖాన్ వార్నింగ్ ఇచ్చార‌ని తెలుస్తోంది.