నాని తో ఆడనున్న హాట్ భామ రకుల్

SMTV Desk 2019-02-21 15:11:09  

నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం జెర్సీ అనే క్రికెట్ నేపథ్యం వున్న సినిమాతో బిజీ గా వున్నాడు. జెర్సీ సెట్స్ పై ఉండగానే మరో సినిమా ని లైన్ లో పెట్టాడు. మనం, ఇష్క్‌,24 సినిమాలు తీసిన దర్శకుడు విక్రమ్‌ కే కుమార్‌ దర్శకత్వంలో నటిస్తున్నాడు నాని. ఈ సినిమాలో ఆర్‌ఎక్స్‌ 100 ఫేం కార్తికేయ కీలక పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రస్టింగ్‌ న్యూస్‌ ఫిలిం నగర్లో వినిపిస్తోంది. వెరైటీ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం రకుల్ ప్రీత్‌ సింగ్‌ స్పెషల్‌ సాంగ్ చేసేందుకు అంగీకరించినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో నాని సరసన నలుగురు హీరోయిన్లు నటిస్తుండగా రకుల్‌ ప్రీత్ స్పెషల్‌ సాంగ్ సినిమాకు మరింత గ్లామర్‌ యాడ్ చేయనుందన్న టాక్‌ వినిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు.