కాసేపట్లో కోర్టుకు విక్రమ్ గౌడ్

SMTV Desk 2017-08-03 13:59:12  VIKRAM GOUD ARRESTED

హైదరాబాద్, ఆగష్టు 3 : తానూ తీసుకున్న గోతిలో తానే పడినట్లుగా తయారైంది మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కథ. తండ్రి నుంచి డబ్బు రాబట్టడం కోసం తనను తుపాకీతో కాల్చడానికి సుపారి ఇచ్చిన విక్రమ్ గౌడ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే! అయితే విక్రమ్ గౌడ్ పూర్తి ఫిట్ నెస్ తో ఉన్నాడని డాక్టర్లు కొద్దిసేపటి క్రితమే డిశ్చార్జ్ చేయగా, అక్కడే ఉన్న పోలీసులు అరెస్ట్ చేశారు. కాని విక్రమ్ తన వెన్నులో బుల్లెట్ ఉందని, నడవలేనని చెప్పడంతో, వీల్ చైర్ లో బయటకు తరలించి ఆపై పోలీస్ జీపులోనే నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లారు. విక్రమ్ ను అంబులెన్స్‌ లో స్టెచ్చర్ పై తీసుకెళ్తే తన ఆరోగ్యం బాగాలేదని కోర్టు అభిప్రాయపడి, మరికొంత సమయం ఇచ్చి అరెస్టును ఆపవచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. ఇంకాసేపట్లో విక్రమ్ ను న్యాయమూర్తి ముందు హాజరు పరుచనున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.