లక్ష్మి పార్వతి పాత్రలో వివాదాల హీరోయిన్ శ్రీ రెడ్డి

SMTV Desk 2019-02-20 19:46:11  

తెలుగు చలన చిత్ర రంగంలో నటి సావిత్రి జీవితం ఆధారంగా మహానటి విడుదలై ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమా తర్వాత కూడా బయోపిక్ ల ఆధారంతో సినిమాలను తెరకెక్కిస్తున్నారు మన దర్శకులు.

ఈ మధ్య నందమూరి బాలకృష్ణ హీరోగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్ర ఆధారంగా ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు రెండు బాగాలుగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇదే సమయంలో దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ ఆర్ చేసిన పాదయాత్రను ఆధారంగా కథను తయారు చేసుకొని మలయళం మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా యాత్ర పేరుతో మహి వి రాఘవ దర్క్షకత్వం లో ఈ చిత్రం తెరకెక్కించారు. అలాగే స్వర్గీయ జయలలిత, తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ల చరిత్ర ఆధారంగా మరికొన్ని చిత్రాలు రాబోతున్నాయి. ఇదే తరుణం లో లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరిట సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒక చిత్రాన్ని రూపొందించాడు. ఈ చిత్రం కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి చరిత్ర ఆధారంగా తెరకేక్కినదే. ఇప్పుడు ఇదే బయోపిక్ ట్రెండ్ లా నడుమ మరో కొత్త సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. లక్ష్మి పార్వతి జీవితం ఆధారం చేసుకొని కేతిరెడ్డి జగదీశ్ రెడ్డి దర్శకత్వంలో లక్ష్మీస్ వీర గ్రంధం పేరుతో ఒక చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో మెయిన్ లీడ్ రోల్ అయిన లక్ష్మి పార్వతిపాత్రని ప్రముఖ సంచలన, వివాదాస్పద హీరోయిన్ శ్రీ రెడ్డి నటించనున్నారు. ఈ చిత్ర కథని వినకుండానే నటిస్తాను అని శ్రీ రెడ్డి ఒప్పుకున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి జి విజయ కుమార్ గౌడ్ గారు నిర్మాతగా వ్యవహరించనున్నారు.

ఈ చిత్రం పై శ్రీ రెడ్డి స్పందిస్తూ లక్ష్మి పార్వతి గారి కష్టసుఖాలు, ఆమె ఎలాంటి జీవితం అనుభవించింది ఎలా బ్రతికింది, ఎవరి సపోర్ట్ లేకపోయే సరికి వ్యభిచారినిగా మారి ఆ వృత్తి నుండి ఎలా బయటకి వచ్చారో అంటూ షాకింగ్ గా వుంది అంటూ ఆమె ఎన్టీఆర్ జీవితం లోకి ఎలా ప్రవేశించారో ఏం జరిగిందో నిజ నిజాలు తెలిపేల ఈ చిత్రం ఉండబోతుంది అని ఆమె మీడియా కి తెలిపారు. ఇతకన్న దర్శకుడు కథ, కథనం ఏమి చెప్పలేదు అంటూ దర్శకుడి పై నమ్మకం తో ఈ సినిమా ఒప్పుకున్నట్లు ఆమె తెలిపారు.