విశాఖ నుండి పవన్ కళ్యాణ్...?

SMTV Desk 2019-02-14 09:31:12  Pawan Kalyan, Vishakhapatnam, East Godavari, Screening Committee, Janasena

అమరావతి, ఫిబ్రవరి 14: ఎన్నికల సీట్ల సర్దుబాటు నాయకులకు ఒక ముఖ్య సవాల్ వంటిది. చాలా మంది నాయకులూ సీట్ల సర్దుబాటులో అవకతవకలు ఎదుర్కొంటారు. కాగా, రానున్న లోక్ సభ ఎన్నికలలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విశాఖపట్టణం నుంచి బరిలోకి దిగనున్నట్టు సమాచారం. తనకు విశాఖపట్నం టికెట్టు కేటాయించాల్సిందిగా రెండు రోజుల క్రితం పార్టీ స్క్రీనింగ్ కమిటీకి దరఖాస్తు చేసుకున్నారు పవన్. అయితే, విశాఖలోని గాజువాక నుంచి లేదంటే తూర్పు గోదావరి జిల్లా నుంచి ఎన్నికల బరిలోకి దిగనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. స్క్రీనింగ్ కమిటీ కూడా గాజువాక వైపే ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ విషయం పట్ల మరో వారం రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని సమాచారం.