అమెరికాలో ఇల్లు ధర10 డాలర్లే.. షరతులు వింటే మాత్రం మైండ్ బ్లాకే!

SMTV Desk 2017-08-03 13:27:19  HOUSE SALE IN AMERIKA

న్యూజెర్సీ, ఆగష్టు 3 : ఒక ఇల్లు కట్టాలంటే ఎన్నో లక్షల వరకు ఖర్చు పెట్టాల్సిందే.! ఇల్లును కొనాలన్నా కూడా అంతకంటే ఎక్కువ ఖర్చే ఉంటుంది. కాని అమెరికాలోని న్యూజెర్సీలో ఒక ఇంటిని అమ్మకానికి పెట్టారు. దాని ఖరీదు వింటే ఎవరైనా ఆశ్చర్యానికి గురికావాల్సిందే..! ఇంతకి దాని ఖరీదు ఎంతంటారా? కేవలం 10 డాలర్లు మాత్రమే. కాని కొన్ని షరతులు వర్తిస్తాయి. అసలు విషయం ఏంటంటే.. అమెరికాలోని న్యూజెర్సీలో మౌంట్ క్లెయిర్ లోని 44 ప్లీజెంట్ ఎవెన్యూలో ఉన్న ఇంటిని 1906లో 20వ శతాబ్దపు తొలినాళ్ల ప్రముఖ ఆర్కిటెక్చర్ డుడ్లే ఎస్ నిర్మించారు. దీనిలో యూఎస్ ఫుట్ బాల్ ప్లేయర్, తొలి అమెరికన్ - ఆఫ్రికన్ ఎఫ్బీఐగా చరిత్ర సృష్టించిన అబ్రే లూయిస్ నివసించారు. కాగా ఇప్పుడు ఈ ఇల్లు ఉన్న స్థలాన్ని స్థానిక హౌసింగ్ సొసైటీ అభివృద్ధి చేయాలని భావిస్తుంది. దీంతో ఈ ఇంటిని 10 డాలర్లకే విక్రయిస్తామని ఆఫర్ పెట్టింది. కాని ఇందులో ఒక మెలిక ఉంది. ఇంత డబ్బు చెల్లించి ఆ ఇంటిని కొనుగోలు చేస్తే వారు ఆ ఇంటికి మాత్రమే యజమానులట ఆ స్థలానికి కాదట. తమ సొంత ఖర్చుతో ఆ ఇంటిని అమాంతం పైకి లేపి, మరో చోటుకి తీసుకెళ్ళి పెట్టుకోవాలి. అంతేకాకుండా ఎక్కువ దూరంలో కూడా ఉంచకూడదు. దగ్గరలో ఆ ఇల్లు పట్టేంత స్థలాన్ని కొనుగోలు చేయాలి, ఇక ఆ ఇంటిని భవిష్యత్తులో కూడా ధ్వసం చేయకూడదు. ఇలాంటి షరతులన్నీ పాటిస్తేనే ఆ ఇంటిని సొంతం చేసుకోవచ్చు మరి.