భార్య అక్రమ సంభందం పెట్టుకుందని పార్టీ ఇచ్చిన భర్త....

SMTV Desk 2019-02-13 21:30:34  Wife and husband, Illegal relationship, party, Venezuela

వెనుజులా, ఫిబ్రవరి 13: భార్య తన స్నేహితునితో అక్రమ సంభందం పెట్టుకుందని బంధువులందరికి విందు ఏర్పాటు చేశాడు ఓ భర్త. ఈ వింత సంఘటన వెనుజులాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల ప్రకారం బాధితుడి పేరేంటో తెలియదుగాని, ఆ ప్రియురాలి పేరు, ఆమె కొత్త ప్రేమికుడి పేర్ల మాత్రం బయటికొచ్చాయి. ఆమె పేరు డలియానా, అతని పేరు ఆల్బర్టో సోబల్వారో.

వీరిద్దరూ తనను చీట్ చేశారంటూ ఆ పెద్దమనిషి విషయం అందరికీ చెప్పి, ఎంజాయ్ చేయండని కోరాడు. ఒకపక్క గుడ్లనీళ్లు కుక్కుకుంటూనే ఆమె తనను ఎలా మోసం చేసిందో వివరించాడు. ఆమె సెల్ ఫోన్‌కు సోబర్వాలో పంపిన మెసేజీలను ప్రదర్శించాడు. ఇదేదో సామాన్యుల గొడవ అయితే పెద్దగా రచ్చ అయ్యేది కాదు.

డలియానాను వలలో వేసుకుంది స్వయంగా దేశాధ్యక్షుడైన మాదురో సన్నిహితుడు, ఎంపీ కావడంతో అల్లరల్లరి అవుతోంది. ‘సాబల్వారో నాకు 20 ఏళ్లుగా మంచిమిత్రుడు. కానీ నా వెనుక మోసం చేశాడు. నా ప్రేయసిని వల్లో వేసుకున్నాడు… వారిద్దరికి నా ధన్యవాదాలు..’ అని అతడు మైక్రో ఫోన్ పట్టుకుని చెబుతోంటే ఆ ప్రియురాలు పక్కనే నుంచుని మిడిగుడ్లతో చూసింది.

అతని చేతిలోని తన ఫోన్ ను లాక్కోవాలని యత్నించగా, అతడు దాన్ని స్విమ్మింగ్ పూల్లో పడేశాడు.