జీఎస్టీ ప్రభావంతో ప్రజల్లో తగ్గిపోయిన కొనుగోలు శక్తి

SMTV Desk 2017-08-03 13:27:11  GST, Statistics, PEOPLE, Services PMI, IHS Markett Principle Economist Puliana DLima

న్యూఢిల్లీ, ఆగస్టు 3 : గత నెల నుంచి వస్తు సేవల పన్ను ప్రజల్లో అవగాహన అమలు అవుతుండగా దీనికి సంబంధించిన కొనుగోలు శక్తి తగ్గిందని తాజా గణాంకాలలో తేలింది. జూలై నెల సర్వీసెస్ పీఎంఐ (పర్చేస్ మేనేజింగ్ ఇండెక్స్) 50 పాయింట్ల సూచిక కన్నా కిందకు పడిపోవడంతో, తాజా సర్వేలో సెప్టెంబర్ 2013 తరువాత అత్యంత కనిష్ఠ స్థాయిలో 45.9 పాయింట్లకు చేరింది. గడచిన జూన్ నెలలో ఎనిమిది నెలల గరిష్ట స్థాయిలో 52.7గా ఉన్న పీఎంఐ, సమీప భవిష్యత్తులో మార్చి 2009 స్థాయికి పడిపోయి 46 వరకూ చేరవచ్చని నిక్కీ/ఐహెచ్ఎస్ మార్కిట్ కాంపోజిట్ పీఎంఐ అంచనాలు. నోట్ల నిషేధం తరువాత పీఎంఐ తగ్గుతున్నప్పటికీ, జీఎస్టీ అమలుకు ముందు పలు రకాల ప్రొడక్టుల్లో వచ్చిన ఆఫర్ల కారణంగా అమ్మకాలు సంతృప్తికరంగా సాగిన మీదటే జూన్ పీఎంఐ మెరుగుగా కనిపించిందని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేశారు. జీఎస్టీ అమలు తరువాత నిర్మాణ రంగం ఎంతో అయోమయంలో పడిపోయిందని, అయితే ఉత్పత్తిరంగంతో పాటు పలు కీలక రంగాల్లో జీఎస్టీ అమలుపై తర్జన బర్జన నెలకొని ఉందని ఎన్నో వస్తువులపై పన్నులు పెరిగాయని, ఈ మేరకు ఐహెచ్ఎస్ మార్కిట్ ప్రిన్సిపల్ ఎకానమిస్ట్ పల్లీయానా డీ లిమా వెల్లడించారు.