చివరి లోక్ సభలో ప్రసంగించిన మోదీ..

SMTV Desk 2019-02-13 21:10:01  Narendra Modi, Lok Sabha, BJP, last Parliament session, pm, sumitra maharajan

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: నేడు చివరి లోక్ సభ సమావేశాలు ముగింపు నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ఈ ఐదు సంవత్సరాల కాలంలో నూటికి నూరు శాతం ప్రజల కోసమే పనిచేశామని అన్నారు. ఈ ఐదేళ్లలో ప్రపంచంలో భారతదేశ గొప్పదనం పెరిగిందని, ఈరోజు మన దేశం పూర్తి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తోందని అన్నారు. అలాగే లోక్ సభ స్పీకర్‌ సమిత్రా మహాజన్‌ నిర్వహంచిన తీరు పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. మూడు దశాబ్ధాల తర్వాత భాజపా పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చిందని గుర్తుచేసారు.

అలాగే తమ ప్రభుత్వంలో ఇద్దరు మహిళలకు కీలక మంత్రి పదవులు ఇచ్చామని, తమ పాలనలో బంగ్లాదేశ్‌తో భూసరిహద్దు వివాదం పరిష్కారమైందని అన్నారు. దేశంలో జీఎస్టీ ప్రవేశపెట్టి దేశ ఆర్థిక రంగ రూపురేఖలు మార్చామన్నారు. అనేక అవినీతి నిరోధానికి చట్టాలు చేశాం. మానవతా దృక్పథంతో ప్రకృతి విపత్తులతో కష్టాలు ఎదుర్కొన్న పలు దేశాలకు ఎంతో సాయం చేశాం. మా పాలనలో అన్నివర్గాల ప్రజలకు సామాజికంగా న్యాయం చేశామన్నారు. అయితే ప్రస్తుతం లోక్‌సభలో ఉన్న సభ్యులంతా మరల సభకు రావాలని కోరారు.