'ఫలక్ నుమా దాస్' మాస్ టీజర్....

SMTV Desk 2019-02-13 20:49:35  Falaknumadas, Vivek sen, Tharun bhaskar, Ee nagaraaniki emaindi, Vellipomakey

హైదరాబాద్, ఫిబ్రవరి 13: ఈ నగరానికి ఏమైంది ఫేం వివేక్ సేన్ హీరోగా, దర్శకునిగా వ్యవహరిస్తూ తీస్తున్న సినిమా ఫలక్ నుమా దాస్ మాస్ కా దాస్. వివేక్ సేన్ ఈ నగరానికి ఏమైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమై వెల్లిపోమాకే అనే సినిమాలో హీరోగా నటించాడు. ఇప్పుడు మళ్ళీ హీరోగా అటు దర్శకునిగా వస్తున్న ఈ సినిమా నుండి చిత్ర బృందం తాజాగా ఓ టీజర్ ను విడుదల చేసింది.

ఈ టీజర్ లో మొత్తం బోల్డ్ గా డైలాగ్స్ వాడాడు వివేక్. పూర్తి హైదరాబాద్ లోని ఫలక్ నుమా లోకల్ బ్యాక్ డ్రాప్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. అంతేకాక ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు.