మోదీని ఉద్దేశించి ‘చౌకీదార్ చోర్ హై’ అన్న బీజేపీ నేత..

SMTV Desk 2019-02-13 20:41:40  Don't want see Narendra Modi PM again, BJP Rebel MP, Bihar, Patna Sahib, Shatrughan Sinha, declares, Amit Shah, mulayam singh yadav

ఢిల్లీ, ఫిబ్రవరి 13: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదిని మరోసారి పీఎంగా చూడాలని అనుకోవట్లేదని ప్రముఖ హిందీ నటుడు, బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా సంచలన వ్యాఖ్యలు చేసారు. లోక్ సభలో జరిగిన బడ్జెట్ సమావేశాల చివరిరోజున ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. కాగా తాను బీజేపీని ఎప్పుడూ వీడనని, కావాలంటే పార్టీ తనను బహిష్కరించవచ్చని సవాల్ విసిరారు. అయితే సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపక అయక్షుడు ములాయం సింగ్ యాదవ్ నరేంద్ర మోదీని మరోసారి పీఎం కావాలని ఆయన ఆశిస్తున్నట్లు తెలిపారు. అయితే సొంతపార్టీ నేత అయిన శత్రుఘ్న సిన్హా ఈ వ్యాఖ్యలు చేయడం మోదికి ఇబ్బంది కలిగించేదే.

దీనికి తోడు బీజేపీయేతర పార్టీల నేతలతో కలిసి ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు నిర్వహించిన ‘తానాషాహీ హటావో, లోక్ తంత్ర బచావో’ ర్యాలీలో ఎంపీ శత్రుఘ్న సిన్హా పాల్గొన్నారు. ఈ ర్యాలీ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని మోదీలపై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ సభలో ఆయన ‘చౌకీదార్ చోర్ హై’ అని నినదించి అలాగే ప్రజలని కూడా చెప్పమని కోరారు.