సుదీర్ఘ విరామం తరువాత నాగ్ తో స్క్రీన్ షేర్ చేసుకోనున్న అమల...!

SMTV Desk 2019-02-13 19:46:31  Akkineni Nagarjuna, Akkineni Amala, shiva, Nirnayam, Prema yuddam, Kiraayi daada, LIfe is beautiful, Manmadhudu2, Rahul ravindran

హైదరాబాద్, ఫిబ్రవరి 13: అక్కినేని నాగార్జున ఆయన సతీమణి అక్కినేని అమల అప్పట్లో కిరాయి దాదా, శివ, నిర్ణయం, ప్రేమ యుద్ధం వంటి సూపర్ హిట్ సినిమాల్లో ఇద్దరు కలిసి నటించారు. వీరి పెళ్లి అనంతరం అమల పెద్దగా సినిమాలు చెయ్యలేదు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 2012 లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో కనిపించిన అమల మళ్ళీ కెమరా ముందుకు రానుంది అని సమాచారం.

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించనున్న మన్మథుడు సీక్వెల్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ప్రస్తుతం నాగార్జున బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగ్ సరికొత్త లుక్ తో ఆకట్టుకుంటాడని సమాచారం. అయితే సినిమాలో ఒక ప్రత్యేక పాత్ర కోసం అమలను ఎంచుకున్నారట.

ఆ పాత్ర కనిపించేది కొద్దీ సేపే అయినా అందరిని ఆకట్టుకుంటుందని టాక్. ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. త్వరలోనే సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులను ముగించి సినిమా షూటింగ్ ని మొదలుపెట్టాలని నాగ్ ప్రయత్నాలు చేస్తున్నారు.