పోలీసులపై హిజ్రాల దాడి : పరుగు తీసిన ఏసీపీ

SMTV Desk 2019-02-13 19:42:58  Hijras Attack ACP at Uppal Police Station, hijras, uppal police station, police attack

హైదరాబాద్, ఫిబ్రవరి 13: హిజ్రాలు ఆ పేరు వింటేనే సాధారణ ప్రజలు వణికిపోతారు, ఇంకా దగ్గరికి వస్తే భయంతో చచ్చిపోతారు. ఇప్పుడు ఈ హిజ్రాలకు పోలీసుల సైతం భయపడే పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ లో పోలీసులపై హిజ్రాలు రెచ్చిపోయారు. ఏకంగా ఏసీపీ పైనే దాడి చేసారు. నగరంలోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ వద్ద అల్లర్లు సృష్టిసస్తున్న హిజ్రాలు, అడ్డుకోడానికి యత్నించిన పోలీస్ ఉన్నతాధికారి(ఏసిపి) పైనే దాడికి పూనుకున్నారు. ఈ నేపథ్యంలో వారి నుండి ఏసిపి తప్పించుకోగా ఇద్దరు పోలీసులకు తీవ్రంగా గాయాలయ్యాయి.

ఒక గొడవ కారణంగా హిజ్రాలు ఉప్పల్ పోలీస్ స్టేషన్ వద్ద పెద్దఎత్తున గుమిగూడారు. ఈ క్రమంలో కొందరు హిజ్రాలు పోలీసులతో గొడవకు దిగగా, వారికి సర్దిచెప్పడానికి వచ్చిన ఏసిపి గాంధీ నారాయణ పై దాడికి పాల్పడ్డారు. అయితే ఈ దాడి నుండి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. కానీ అక్కడే వున్న ఇద్దరు హోంగార్డులు వీరి చేతిలో దాడికి గురై తీవ్రంగా గాయపడ్డారు. కాగా పోలీసులపై దాడికి చేసిన హిజ్రాలను వెంటనే అరెస్ట్ చేయాల్సిందిగా ఏసిపి నారాయణ ఆదేశించారు.