గర్భాన్ని బయటకు తీసి పిండంలోని పాపకు సర్జెరీ...లండన్ లో వింత సంఘటన

SMTV Desk 2019-02-13 19:20:06  Surgery Unborn baby, Procedure, Landon, Spaina by feda disease

లండన్‌, ఫిబ్రవరి 13: లండన్‌లోని గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్ ఆస్పత్రిలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. గర్భాన్ని బయటకు తీసి పిండంలోని పాపకు సర్జెరీ చేసి మళ్ళీ గర్భాశయంలో ఉంచారు. పూర్తి వివరాల ప్రకారం ఆమె ఐదు నెలల గర్భవతి. భర్తతో కలిసి రెగ్యులర్ చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్లింది. పరీక్షలు చేసిన డాక్టర్.. బిడ్డకు వెన్నుముక సరిగ్గా ఎదగడం లేదని, అందులో చిన్న రంధ్రం (స్పైనా బై ఫెడా) ఏర్పడటమే ఇందుకు కారణమని షాకింగ్ వార్త చెప్పారు.

ఎందుకొచ్చిన సమస్య, చక్కగా అబార్షన్ చేయించుకోండని డాక్టర్లు సూచించారు. ఐదు నెలల పిండం కావడంతో.. బిడ్డకు అపుడపప్పుడే కనుబొమ్మలు వస్తున్నాయి, పుర్రె, వెన్నుపూస గట్టిపడుతోంది. దీంతో అబార్షన్‌కు ఆ తల్లి మనసు ఒప్పుకోలేదు. కన్నపేగును చంపుకోలేనని, బిడ్డకు ఎలాగైన జన్మనిచ్చి తీరుతానని చెప్పింది.

దీంతో వైద్యులు ‘ఫీటస్ రిపేర్’ టెక్నిక్‌తో బిడ్డ వెన్నుపూసను సరిచేయొచ్చని చెప్పారు. కానీ తల్లీబిడ్డ ప్రాణాలకు ప్రమాదమని హెచ్చరించారు. అయినా కూడా ఆ తల్లి వెనక్కి తగ్గలేదు. లండన్‌లోని గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్ ఆస్పత్రిలో చేరింది. ఆ గర్భిణి పేరు బెథన్ సింప్సన్. మంగళవారం డాక్టర్లు 4గంటల పాటు సర్జరీ చేశారు. గర్భాన్ని బయటకు తీసి పిండంలోని పాప వెన్నుపూసలో ఉన్న రంధ్రాన్ని పూడ్చారు.

తర్వాత మళ్లీ పిండాన్ని బెథన్ గర్భాశయంలో ఉంచారు. ఆపరేషన్ సక్సెస్ అయింది. ఆ తల్లీ ఆనందానికి అవదులు లేవు. సింప్సన్ జూన్ నెలలో డెలివరీ అవుతుందని డాక్టర్లు వెల్లడించారు.