కేసీఆర్ పై బీజేపీ నేత ఫైర్..

SMTV Desk 2019-02-13 16:57:03  lakshman, bjp president telangana, kcr, trs, telangana cm, pm, narendra modi, amith shah, bjp

హైదరాబాద్, ఫిబ్రవరి 13: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు.ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో అన్ని శాఖల్లో అవినీతి పెద్దఎత్తున పెరిగిపోయిందని విమర్శించారు. కాగా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో భాజపా పోటీ చేస్తుందని తెలిపారు. అయితే తెరాస 16 లోక్ సభ స్థానాల్లో గెలుస్తుందని ఆ పార్టీ నేతలు ఊహాల్లో తేలుతున్నారని విమర్శించారు. అయిన 16 ఎంపీ స్థానాలు గెలిచినంత మాత్రాన సీఎం కేసీఆర్ పీఎం అయిపోతారా అని ప్రశ్నించారు. తెలంగాణాలో కేబినెట్ లేకపోవడంతో వేల కొద్దీ పనులు, వందల కొద్దీ ఫైల్స్ పేరుకుపోతున్నాయని ఆరోపించారు.

కాగా లోక్ సభ ఎన్నికల ప్రచారానికి బీజేపీ సర్వం సిద్ధమైందని తెలిపారు. ఈ నెలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, మార్చి నెలలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ప్రచారం జరుపుతారని చెప్పారు. ఈ నేపథ్యంలో మనకీ బాత్-మోదీకే సాత్, మేరా పరివార్-బీజేపీ పరివార్, కమల్ జ్యోతి వంటి కార్యక్రమాల ద్వారా ప్రచారం చేపట్టి బీజేపీ జెండా ఎగురవేస్తామని చెప్పారు.