వేలిముద్రలకు బదులు చెవిముద్రలు...శాస్త్రవేత్తల కొత్తరకం అధ్యయనం

SMTV Desk 2019-02-13 14:53:14  Finger prints, Ear prints, Identify marks, Adhar card, Voter Card, Southampton University

ఫిబ్రవరి 13: ఓ వ్యక్తి గుర్తింపు కోసం ప్రధాన పాత్ర పోషించేది వేలిముద్ర. ఓటరు కార్డు, ఆధార్ కార్డు..నానా గుర్తింపు కార్డుల కోసం వేలిముద్రలు ఇస్తుంటాం. అయితే వేలిముద్రలకు కూడా నకిలీలను తయారు చేస్తుండండంతో శాస్త్రవేత్తలు కొత్తరకం ముద్రలపై అధ్యయనం చేస్తున్నారు. వేలిముద్రలకు బదులు చెవిముద్రలు వాడితే నకిలీను అరికట్టొచ్చని, వీటిని కాపీ కొట్టడం అంత సులువు కాదని అంటున్నారు.

సౌతాంప్టన్ యూనివర్సిటీకి చెందిన మార్క్ నిక్సన్ బృందం చెవిముద్రలపై అధ్యయనం నిర్వహిస్తోంది. వేలిముద్రలు, ఫేసియల్ రికగ్నిషన్ వంటి వాటితో పోలిస్తే చెవిముద్రలతో ఎక్కువ ప్రయోజనాలు ఉన్నట్లు వారి అధ్యయనంలో తేలింది. చెవులు జీవితాంతం పెరుగుతూనే ఉన్నా, వారి ప్రాథమిక అమరికలో మార్పులు వుండవని చెబుతున్నారు.

‘చెవుల నిర్మాణం స్థిరంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు మారే ముఖ నిర్మాణం కంటే ఇవే బెటర్. ఫోన్ లాక్‌కు చెవిముద్రలను వాడుకోవచ్చు. ఐరిస్, రెటీనా, వేలిముద్రలతో పోలిస్తే ఇవి పెద్దవి కనుక సులభంగా గుర్తించవచ్చు. రాపిడి వల్ల వేలిముద్రలు అరిగిపోతాయి. కానీ చెవిముద్రలు అలా కాదు. వీటికి నకిలీలను చేయడం కష్టం..’ అని నిక్సన్ పేర్కొన్నారు.