తెలంగాణ రాష్ట్రంలో రేపు తేలికపాటి వర్షాలు

SMTV Desk 2019-02-13 08:02:46  Telangana, Rainfall, Afghanistan, Adilabad, Nizamabad, Ramagundam, Hakeempeta

హైదరాబాద్, ఫిబ్రవరి 13: తెలంగాణ రాష్ట్రంలో గురువారం అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆఫ్ఘనిస్థాన్ వైపు నుండి గాలులు వీస్తుండగా, ఆగ్నేయ దిశ నుంచి వస్తున్న గాలులు చత్తీస్‌గఢ్-తెలంగాణ ప్రాంతంలో కలవనున్నాయి. ఈ గాలుల కలయిక వల్ల క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. సోమవారం రాత్రి మెదక్ లో 13 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, ఆదిలాబాద్‌‌లో 16 డిగ్రీలు, నిజామాబాద్, రామగుండం, హకీంపేటలలో 19 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.