35 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్న బీఎస్ఎన్ఎల్...!

SMTV Desk 2019-02-12 23:16:06  BSNL, JIO, BSNL Employees return home

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన జియో... మిగితా టెలికాం కంపెనీల మీద పెద్ద బండ రాయి వేసింది. దీని వల్ల అనేక టెలికాం కంపెనీలు నష్టాల్లో కొట్టుకుపోతున్నాయి. దాంట్లో మొదటిది బీఎస్ఎన్ఎల్. దానికి మొదటి నుంచి కష్టాలే. ప్రభుత్వ మద్దతు ఉన్నా కూడా బీఎస్ఎన్ఎల్ కోలుకోవడం చాలా కష్టంగా మారింది.

లాభం లేదనుకొని ఇదిగో ఇలా ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని యోచిస్తోంది. దానిలో భాగంగానే 35 వేల మంది ఉద్యోగులను వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ కింద ఇంటికి పంపించడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే 35 వేల మందిని వీఆర్ఎస్ స్కీమ్ కింద ఇంటికి పంపించాలంటే దాదాపు 13 వేల కోట్లు అవసరమవుతాయట.

సంస్థ లాభాల్లోకి రావడానికి చేయాల్సిన దానిపై ఐఐఎం ఓ నివేదిక తయారు చేసింది. ఆ నివేదికలోనే వీఆర్ఎస్ కు సంబంధించిన విషయాలను వెల్లడించింది. బీఎస్ఎన్ఎల్ లో ప్రస్తుతం 1.75 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. కంపెనీ వార్షిక వ్యయం 15 వేల కోట్లు. కానీ ఆదాయం మాత్రం అంతంతమాత్రమే.

దీంతో ఖర్చులు తగ్గించుకునేందుకు ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు కొన్ని రకాల బెనిఫిట్స్ ను తగ్గించింది. దాంతో పాటు ఉద్యోగులనే తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా 35 వేల మందికి ఉద్వాసన పలకనుంది కంపెనీ.