బొమ్మాళీ రవిశంకర్‌ కు ఆర్జీవి ప్రశంశలు...

SMTV Desk 2019-02-12 21:50:12  Ram gopal varma, Lakshmis NTR, P Ravishankar, Gharjana simha gharjana song from lakshmis NTR

హైదరాబాద్, ఫిబ్రవరి 12: రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్. ఈ సినిమాలో బొమ్మాళీ రవిశంకర్‌( సాయికుమార్‌ సోదరుడు) ఓ ఫవర్‌ఫుల్‌ పాటను పాడినట్లు ఆర్జీవి తెలిపారు. ఈ చిత్రంలోని ‘‘గర్జన., సింహగర్జన’’అంటూ సాగిన ఒక పాటని వర్మ విడుదల చేసాడు.

ఈ పాటను బొమ్మాళి రవిశంకర్ పాడగా..దానికి వచ్చిన రెస్పాన్స్ కి వర్మ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు. శంకర్ గొంతులో ఎదో అద్భుతం ఉంది, నీ గొంతుతో పాడిన ఈ పాట స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ ని కూడా కదిలిస్తుందని వర్మ పేర్కొన్నారు. సిరాశ్రీ రాసిన ఈ పాటకు కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు.

గర్జన., సింహగర్జన అంటూ సాగే ఈ పాటకు సిరశ్రీ సాహిత్యాన్ని అందించగా., కళ్యాణ్‌ మాలిక్‌ స్వరపరిచినట్లు ఆర్జీవీ తెలిపారు.