పోటీకి నేను సిద్ధం : ధనుష్

SMTV Desk 2017-08-03 12:04:10  DHANUSH MOVIE RELEASE DATES

హైదరాబాద్, ఆగష్టు 3 : "రఘువరన్ బీటెక్" తో మంచి సూపర్ హిట్ ను, మరిచిపోలేని సినిమాను ప్రేక్షకులకు అందించిన ధనుష్ ఆ సినిమాకు సీక్వెల్ గా "విఐపి 2" చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషలలో విడుదల చేయనున్నారు. అయితే ముందుగా ఈ సినిమాను ఆగష్టు 11 న విడుదల చేయాలనుకున్నారు కాని తమిళంలో "వివేగం" చిత్రం కూడా అదే రోజు విడుదల కానుంది. దీంతో ధనుష్ తన సినిమాల రిలీజ్ తేదీని ఆగష్టు 24 కి మార్చుకున్నాడు. కాగా కొన్ని కారణాలవల్ల "వివేగం" చిత్రం వాయిదా పడడంతో ముందుగా అనుకున్న ప్రకారం ధనుష్ ఆగష్టు 11నే సినిమాను విడుదల చేయనున్నారు. అదే రోజున తెలుగులో "జయ జానకి నాయక", "లై", "నేనే రాజు నేనే మంత్రి", సినిమాలు విడుదల కానున్నాయి. అయితే ఈ పోటీకి తానూ కూడా సిద్దమే అంటున్నారు ధనుష్. ఈ సినిమాలన్నింటిలో ఏ సినిమా అత్యధిక వసూల్లు సాధిస్తుందో వేచి చూద్దాం.