చిరుతో చాన్స్ మిస్ చేసుకున్న అనుష్క...?

SMTV Desk 2019-02-12 20:45:12  Anushka shetty, Bhagamati, Silence, Director Hemanth madhukar, Photographer Sunder ram, Megastar chiranjevi, Koratala shiva

హైదరాబాద్, ఫిబ్రవరి 12: టాలీవుడ్ స్వీటీ అనుష్క భాగమతి సినిమా తరువాత సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకుంది. అయితే ఈ బొమ్మాలి తాజగా ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఈ సినిమాకు ‘సైలెన్స్’ అనే టైటిల్‌ను చిత్రబృందం పరిశీలిస్తోంది.

అయితే ‘భాగమతి’ తరువాత ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఫొటోలేవీ బయటకు రాలేదు. తాజాగా ఆమె లేటెస్ట్ ఫొటోలను ఫొటోగ్రాఫర్ సుందర్ రాము సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలను నెటిజన్లు షేర్ చేయడమే కాకుండా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇక దర్శకుడు కొరటాల శివ చిరంజీవి పక్కన అనుష్క అయితే బాగుంటుందని తనని సంప్రదించడం జరిగినట్లు సమాచారం. అయితే అనుష్క ఈ సినిమా చెయ్యడానికి నో చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఆమెకు సినిమాలో జస్ట్ హీరోయిన్ పాత్రేనని ప్రాధాన్యం పెద్దగా లేదని సమాచారం. తనకు ప్రాధాన్యం లేనందున అనుష్క ఈ పాత్ర చెయ్యడానికి అంగీకరించలేదని వార్త వినిపిస్తోంది.

టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న అనుష్క మంచి పాత్రలు తనకు గుర్తింపు తెచ్చే పాత్రలు మాత్రమే చేయాలని తను భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.