ఎట్టకేలకు విడుదలకు సిద్దమవుతున్న 'ఎన్టీఆర్ మహానాయకుడు'...

SMTV Desk 2019-02-12 20:02:59  NTR Mahanayakudu, Balakrishna, NTR Mahanayakudu release date, NTR Kathanyakudu

హైదరాబాద్, ఫిబ్రవరి 12: ఎన్టీఆర్ మహానాయుకుడు విడుదల తేదీని సినీ బృందం ఎట్టకేలకు ఖరారు చేసింది. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ఎన్టీఆర్ కథానాయకుడు బెడిసి కొట్టడంతో సెకండ్ పార్ట్ విడుదలకు చిత్ర బృందం కాస్త సమయం తీసుకుంది. అంతేకాక గత కొద్ది రోజులుగా ఈ సినిమా విడుదల తేదీపై అనేక రూమర్స్ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. పోయిన వారమే రావాల్సిన ఈ సినిమాను మొత్తానికి మరో పది రోజుల్లో రిలీజ్ చెయ్యాలని చిత్ర యూనిట్ ఒక తేదీని ఫిక్స్ చేసుకుంది.

కాగా ఈ నెల 22న పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన మహానాయకుడు సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ఎంతవరకు విజయాన్ని అందుకుంటుందో గాని మొదటి భాగం ఇచ్చిన రిజల్ట్ ఇంకా ఎవరు మర్చిపోలేకపోతున్నారు. సినిమాలో అసలైన అంశాలను ఎంతవరకు కరెక్ట్ చూపిస్తారు అనేది అందరిలో ఆసక్తిని రేపుతోంది.

ఇక ఫైనల్ గా సినిమాను విడుదల చేయడానికి రెడీ అయిన బాలయ్య గ్యాంగ్ త్వరలోనే మరో ట్రైలర్ ను కూడా రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సెకండ్ పార్ట్ ప్ ప్రమోషన్స్ కూడా వీలైనంత త్వరగా స్టార్ట్ చెయ్యాలని ప్రణాళికలు రచిస్తున్నారు.