ప్రేమికుల రోజు టీజర్ తో వస్తున్న అక్కినేని జంట..

SMTV Desk 2019-02-12 18:47:08  Nagachaitanya, Samantha, majili, teaser, nani, ninnukori, feb 14

హైదరాబాద్, ఫిబ్రవరి 12: అక్కినేని నాగ చైతన్య, సమంత పెళ్ళి తర్వాత మొదటిసారి కలిసి నటిస్తున్న సినిమా మజిలీ . ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. నాని హీరోగా శివ నిర్వాణ తెరకెక్కించిన నిన్నుకోరి సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా తరువాత ఆయన కొంత గ్యాప్ తీసుకుని మజిలీ చిత్రం రూపొందిస్తున్నాడు. ఈ సినిమా కూడా రొమాంటిక్ ప్రేమకధగా తెరకెక్కుతుంది. ఇప్పటికే చాలావరకూ షూటింగ్ పూర్తి చేసుకుంది.

అయితే ఈ నెల 14న ప్రేమికుల రోజుని పురస్కరించుకుని ఈ చిత్రం నుంచి టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. కాగా ప్రేమికుల రోజు ఉదయం 9 గంటల 9 నిమిషాలకి టీజర్ ను విడుదల చేయనున్నట్లు పోస్టర్ ను కూడా రిలీజ్ చేసారు. ఈ చిత్రానికి గోపిసుందర్ అందించిన సంగీతం హైలెట్ గా నిలవనుంది. సినిమాని ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయనున్నారు.