త్వరలో సెట్స్ పైకి 'భీష్మ'...ముహూర్తం ఫిక్స్

SMTV Desk 2019-02-12 13:21:06  Nithin, Venki Kudumula, Rashmika, Bheeshma

హైదరాబాద్, ఫిబ్రవరి 12: ఛలో సినిమాతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు దర్శకుడు వెంకీ కుడుముల. ఇప్పుడు ఈ దర్శకుడు మరో ప్రేమకథను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ప్రస్తుతం హిట్ లేని నితిన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం భీష్మ . ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలు కావాల్సి ఉండగా నితిన్ భుజానికి గాయం కారణంగా వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ప్రారంభించడానికి ముహూర్తం ఫిక్స్ చేసారు. ఈ నెల 25 న ఏ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

నితిన్ సరసన రష్మిక హీరోయిన్ గా నటించబోతుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాని కూడా దర్శకుడు ఛలో సినిమాలాగే కామిక్ లవ్ స్టొరీగా తెరకెక్కించనున్నాడని సమాచారం. భీష్మ తర్వాత నితిన్ సూర్య ప్రతాప్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్‌ సంస్థ నిర్మాణంలో ఒక సినిమా చేయనున్నాడు.