తన తల్లితో ఈడీ ఎదుట రాబర్ట్ వాద్రా

SMTV Desk 2019-02-12 13:14:55  Robert Vadra, Maureen vadra, Priyanka Gandhi, ED

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: ప్రముఖ పారిశ్రామికవేత్త రాబర్ట్ వాద్రా మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కాగా వాద్రా ఈరోజు జైపూర్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్(ఈడీ) అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈడీ ఆదేశాల మేరకు రాబర్ట్ వాద్రా తల్లి మౌరీన్ వాద్రా కూడా విచారణకు హాజరయ్యారు. వీరితో పాటు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. ఈ క్రమంలో జైపూర్‌లోని ఈడీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు ప్రియాంక గాంధీకి అనుకూల నినాదాలు, మోడీ ప్రభుత్వనికి వ్యతిరేక నినాదాలు చేశారు.