జోరు తగ్గలేదు...వేరే భాషల్లో బిజీగా ఉన్నా

SMTV Desk 2019-02-12 11:26:00  Rakul Preet singh, Venki Mama, dev

హైదరాబాద్, ఫిబ్రవరి 12: కెరీర్ ప్రారంభం అయిన కొద్ది రోజుల్లోనే రకుల్ ప్రీత్ సింగ్ స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. బ్రేక్ లేకుండా సినిమాలు చేసింది. గత మూడేళ్ళ నుంచి ఆమె స్పీడ్ తగ్గించింది. క్రమంగా టాలీవుడ్ లో సినిమాలు తగ్గిపోతూ వస్తున్నాయి. గత ఏడాది ఆమె నటించిన ఒక్క చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. అంతే కాకుండా కొత్త హీరోయిన్ ల రాకతో రకుల్ జోరుకు బ్రేక్ పడిందని అనుకోవచ్చు. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్క తెలుగు సినిమా మాత్రమే ఉంది. తెలుగులో అవకాశాలు తగ్గిపోతున్నందుకు గల కారణం రకుల్ ని అడిగితే ఆమె సమాధానమిస్తూ తెలుగులో అవకాశాలు తగ్గిపోయినా బాలీవుడ్, కోలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తున్నానని, వాటికీ డేట్స్ ఇవ్వడం వల్లే తెలుగులో సినిమాలు చేయడానికి అవకాశం రావట్లేదని ఆమె అన్నారు.

ప్రస్తుతం తను తమిళంలో మూడు సినిమాలు, హిందీలో రెండు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నట్లు రకుల్ చెబుతోంది. అన్ని భాషల్లో కలిపి ఈ సంవత్సరం తను నటించిన అయిదు సినిమాలు విడుదల కాబోతున్నాయని ఆమె చెప్పారు. రకుల్ ప్రీత్ సింగ్ కార్తీ తో తమిళంలో నటించిన దేవ్ చిత్రం తెలుగులో ఫిబ్రవరి 14 న విడుదల కానుంది. తెలుగులో ఆమె వెంకటేష్, నాగ చైతన్య తో కలిసి నటిస్తున్న వెంకిమామ సినిమా షూటింగ్ లో త్వరలో పాల్గొననుంది.