కాంగ్రెస్ నేతపై మడ్డిపడ్డ హిమాచల్ ప్రదేశ్ సీఎం

SMTV Desk 2019-02-12 10:03:31  Jairam Tagore, Agni Hotri, JMPS, Prashasan Janatha Ke Dwar, Congress, Assembly, Hansraj

సిమ్ల, ఫిబ్రవరి 12: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ అసెంబ్లీలో సహనం కోల్పోయి తనను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలపై మద్దిపడ్డారు. కాంగ్రెస్ నేత ముకేశ్ అగ్నిహోత్రిపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నాయకులకు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ఓ ప్రశ్నకు బదులుగా జైరాం అసెంబ్లీలో మాట్లాడుతూ, జన్ మంచ్ ప్రోగ్రామ్స్(జేఎంపీఎస్) పథకానికి సంబందించిన ఖర్చులపై వివరణ ఇస్తున్నారు.

జైరాం ఠాకూర్ మాట్లాడుతుండగా మధ్యలో మాట్లాడిన అగ్నిహోత్రి, ఇదేమీ కొత్తది కాదని ప్రశాసన్ జనతా కే ద్వార్ పేరుతో కాంగ్రెస్ హయాంలో ఇలాంటి పతాకాన్ని తిసుకోచ్చమని వ్యాఖ్యానించారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహంతో ముఖ్యమంత్రి సభాపతి స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ హన్స్‌రాజ్‌ను ఉద్దేశించి సభలోని సభ్యుడెవరూ ఇలా జోక్యం చేసుకోవద్దంటూ ఒకింత ఆగ్రహంగా చెప్పారు. ఇంకోసారి ఇలా జోక్యం చేసుకోవద్దని, కూర్చోవాలని హెచ్చరికలు జారీ చేశారు. కాగా, ముఖ్యమంత్రి తీరుపై కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.