మానవ శరీరం గురించి నమ్మలేని నిజాలు

SMTV Desk 2017-08-03 10:30:35  breaf explanation about human body

హైదరాబాద్, ఆగష్టు 3 : పుట్టుక నుండి మరణం వరకు ఎన్నో ఏళ్ళ పాటు అవిశ్రాంతంగా పనిచేసే మానవ శరీరం ఒక అద్భుతమైన నిర్మాణం. అలాంటి శరీరంలో కొన్ని ఆసక్తికర నమ్మలేని నిజాలివి. *మన శరీరంలో 1,00,000 మైళ్ల పొడవైన రక్త నాళాలు ఉంటాయి. చిన్న పిల్లల్లో అయితే ఇవి 60 వేల మైళ్ల పొడవుంటాయి. *ఒక మనిషి రోజులో 50 వేల సార్లు ఊపిరి పీలుస్తాడు. *ఫింగర్ ప్రింట్స్ మనం అమ్మ కడుపులో ఉండగానే తయారై పోతాయి. గర్భంలో ఉన్న ఆరో నెలలో ఇవి ఏర్పడతాయి. *సాధారణంగా మానవుడు నిద్రలో వచ్చే కలల్లో 90% వరకు మెలకువ రాగానే మర్చిపోతుంటారు. *పురుషుల గుండెతో పోల్చుకుంటే మహిళల గుండె వేగంగా కొట్టుకుంటుంది. *మన శరీరంలో ప్రతి నిమిషానికీ 30 కోట్ల కణాలు చనిపోయి వాటి స్థానంలో కొత్తవి వచ్చి చేరుతుంటాయి. *ఏదైనా సమాచారాన్ని మెదడు శరీర అవయవానికి అందించాల్సి వస్తే, అది గంటకు 268 మైళ్ల వేగంతో పయనిస్తుంది. *మన శరీరంలో రక్తం సరఫరాకాని ఒకే ఒక్క భాగం, కంటిలో ఉండే కార్నియా. *మనిషి మెదడులో కొన్ని లక్షల కంప్యూటర్లలో దాచగలిగినంత మెమొరీని దాచవచ్చు. మెదడులో 2. పెటా బైట్ల (అనగా సుమారు పది లక్షల గిగాబైట్లు) సమాచారాన్ని దాచుకోవచ్చు. *సాధారణంగా శరీరంలో ఏదైనా అవయవం డ్యామేజ్ అయితే, తనంతట తానుగా బాగు చేసుకుంటుంది. అలా బాగు చేసుకోలేని అవయవం అంటూ ఏదైనా ఉందంటే అవి మన దంతాలే. *నెలకు సగటున అర అంగుళం మేర తల వెంట్రుకలు పెరుగుతాయి. వేసవి కాలంలో, నిద్రిస్తున్న వేళ జుట్టు ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. *మన జీవితకాలం పాటు జుట్టును పెరగనిచ్చి, ఒక్కో వెంట్రుకనూ అలా పేర్చుకుంటూ పోతే సుమారు 725 కిలోమీటర్ల మేర పరవవచ్చు. *మనం గోడ వైపు తిరిగి నిలబడి గోడకు తలను ఆనించడం ద్వారా 150 కేలరీల శక్తిని కోల్పోతాము. *ఊపిరితిత్తులను పూర్తిగా విడదీస్తే, అది 50 నుంచి 75 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పరచుకుంటుంది. అది దాదాపు ఓ టెన్నిస్ కోర్టు వైశాల్యంతో సమానం. *మానవ శరీరంలోని అతిపెద్ద కణం ఆడవారిలో అండం కాగా, అతి చిన్న కణం మగవారి వీర్య కణం. *వీర్య కణం పొడవు 50 మైక్రో మీటర్లు (సుమారు 0.05 మిల్లీ మీటర్లు) ఉండగా, అండం దానికన్నా 30 రెట్లు పెద్దదిగా కంటికి కనిపించేంతగా ఉంటుంది.