లవర్స్ డే సందర్బంగా నాని బహుమతి

SMTV Desk 2019-02-12 09:17:39  Nani, jersey, first Song, Shraddha Srinath, Anirudh Ravichandran

హైదరాబాద్, ఫిబ్రవరి 12: నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా జెర్సీ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. సినిమా ప్రమోషన్ కూడా ప్రారంభమైంది. ఇందులో భాగంగా ప్రేమికుల రోజు సందర్భంగా మొదటి పాటను ఫిబ్రవరి 14 న విడుదల చేయనున్నట్టు నిర్మాతలు తెలిపారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. గౌతమ్‌ తిన్ననూరి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో నాని ఒక క్రికెటర్ పాత్రలో కనిపించనున్నాడు. నానికి జోడీగా శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటించింది. తాజాగా నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా ఉన్న పోస్టర్ ని చిత్ర బృందం విడుదల చేసింది. అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.