అరసవల్లిలో ప్రారంభమైన రథసప్తమి వేడుకలు

SMTV Desk 2019-02-12 07:43:59  Arasavalli, Srikakulam, Suryanrayana Swamy, Rathasapthami

అమరావతి, ఫిబ్రవరి 12: ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లిలో రథసప్తమి వేడుకలు ప్రారంభమయ్యాయి. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వేదపండితులు వేద మంత్రోచ్చారణలు, మంగళధ్వనులతో సూర్యనారాయణస్వామికి మహాక్షీరాభిషేకం చేశారు. మంగళవారం ఉదయం ఆరు గంటల వరకు స్వామి వారి మూల విరాట్‌కు పాలాభిషేకం నిర్వహించారు.

రథసప్తమి వేళ స్వామివారిని దర్శించుకునేందుకు జనం లక్షల సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి భక్తులతో జనసంద్రంగా మారింది. తెల్లవారుజాము నుంచే స్వామి వారిని దర్శించుకుని క్యూలలో బారులు తీరారు. జనం పెద్ద ఎత్తున రావడంతో, రద్దీని దృష్టిలో పెట్టుకొని నిర్వాహకులు భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు ఇలాంటి ఎబందులు తలెత్తకుండా తాగు నీటితో సహా అన్ని వసతులు ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు.