'అలాద్దిన్' ట్రైలర్ విడుదల

SMTV Desk 2019-02-11 14:12:15  Aladdin, Disney, Hollywood, Aladdin Trailer release

హైదరాబాద్, ఫిబ్రవరి 11: మనం చిన్నప్పటి నుంచి వింటున్న అల్లావుద్దీన్ కథ ఇప్పుడు హాలీవుడ్ తెరపై సందడి చేయనుంది. అల్లావుద్దీన్ కథపై ఇప్పటికే ఎన్నో సినిమాలు, ఫెయిరీ టైల్స్ వచ్చాయి. ఈ కథలోని జీని పాత్ర అందరికి సుపరిచితమే. డిస్నీ సంస్థ తాజాగా ఈ చిత్రాన్ని తెరకేక్కించింది. అల్లాద్దీన్ చిత్రానికి సంబందించిన ట్రైలర్ ను డిస్నీ సంస్థ విడుదల చేసింది. ఈ సినిమాలో హాలీవుడ్ సూపర్ స్టార్ విల్ స్మిత్, నయోమి స్కాట్, మేనా మస్సుద్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ప్రతిష్టాత్మకమైన జీని పాత్రలో విల్ స్మిత్ నటించారు. గుయ్ రిట్జీ అల్లాద్దీన్ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సంవత్సరం మే 24 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.