మెగా హీరోయిన్ పెళ్లిపై స్పష్టత ఇచ్చిన నాగబాబు

SMTV Desk 2019-02-11 13:24:07  nagababu, Niharika, Suryakantham, Niharika Wedding

హైదరాబాద్, ఫిబ్రవరి 11: మెగా బ్రదర్ నాగబాబు ఈ మద్య రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల ఆయన ఒక చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ లో ఆయన ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టారు. ఈ క్రమంలో ఆయన ముద్దుల కూతురు నిహారిక గురించి ఆయన మాట్లాడారు. చానెల్ వారు నిహారిక పెళ్లి ప్రస్తావన తీసుకురాగా దానికి స్పందిస్తూ ఆయన త్వరలోనే నిహరికకు పెళ్లి చేస్తామని తెలిపారు. ప్రస్తుతం ఆమె పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించామన్నారు. ఈ విషయం గురించి నిహరికతో సినిమాల్లోకి రాకముందే చర్చించామన్నారు.



నిహారిక సినిమాల్లోకి వెళ్తా అన్నప్పుడు తన అభిప్రాయాన్ని గౌరవించి ఓకే చెప్పాను. కానీ మూడేళ్ళలో ఆమెకి పెళ్లి చేస్తామని సినిమాల్లోకి రాకముందే చెప్పాము. దీని ప్రకారం 2018 వరకు పెళ్లి ప్రస్తావన తీసుకురాలేదు. ఇప్పుడు తాము ఇచ్చిన సమయం అయిపోయింది కాబట్టి నిహారిక పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టామని నాగబాబు తెలిపారు. నిహారిక పెళ్లి విషయంలో అబ్బాయి గురించి ఎలాంటి పట్టింపులు లేవని, అబ్బాయి మంచి వాడైతే చాలని ఆయన అన్నారు. అయితే ముఖ్యంగా అతను నిహరికకు నచ్చాలని స్పష్టం చేసారు.

అబ్బాయి కులం విషయంలో పట్టింపులు లేవని ఆయన అన్నారు. అయితే కాపు కులాన్ని గౌరవిస్తామని, తమ కులంలో మంచి అబ్బాయి దొరికితే మంచిదే, లేకపోతే వేర్ కులం అబ్బాయి అయినా అంగీకరిస్తామని నాగబాబు తెలిపారు. గతంలోనూ నిహారిక పెళ్లి విషయంలో వార్తలు వినిపించాయి. సాయి ధరమ్ తేజ్, నిహారిక పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే అవి నిజం కాదని నాగబాబు ఆ వార్తల్ని కొట్టి పారేసారు. వారిద్దరూ వరుసకి బావ మరదల్లె అయినప్పటికీ పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని నాగబాబు ఆన్నారు. ప్రస్తుతం ఆమె హీరోయిన్ గా బిజీ అయిపోయింది. నిహారిక నటించిన సూర్యకాంతం సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.