పార్టీ ప్రముఖులతో రాహుల్ గాంధీ సమావేశం

SMTV Desk 2019-02-09 14:00:41  Rahul Gandhi, Uttham Kumar Reddy, Bhatti Vikramarka, Raghuveera Reddy, AICC, Delhi

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 09: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జోరు పెంచారు. ఈరోజు ఢిల్లీలో పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ ప్రముఖులకు పార్టీ యొక్క వ్యూహాలను వివరించారు. రానున్న ఎన్నికలలో పార్టీని విజయం వైపు మళ్ళించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల నుండి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టివిక్రమార్క, రఘువీరారెడ్డిలు హాజరయ్యారు.