విడుదలైన '118' లిరికల్ సాంగ్ వీడియో

SMTV Desk 2019-02-09 12:22:08  Kalyan ram, Shalini Pande, Lyrical Video release, Shekhar chandra, Ramanjaneyulu

హైదరాబాద్, ఫిబ్రవరి 09: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా గుహన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 118 . ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ కి జోడీగా అర్జున్ రెడ్డి హీరోయిన్ శాలిని పాండే నటిస్తుంది. మరో హీరోయిన్ గా నివేదా థామస్ నటిస్తోంది. తాజాగా ఈ సినిమాలో నుంచి మొదటి పాట లిరికల్ వీడియో విడుదల చేసారు. ఈ పాట ఇప్పుడు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతుంది. ఈ లవ్ ట్రాక్ కి శేఖర్ చంద్ర సంగీతం, రామాంజనేయులు సాహిత్యం అందించారు. యాజిన్ నిజర్ పాడిన ఈ పాట యూత్ ని ఆకట్టుకునేలా ఉంది. 118 సినిమాపై కళ్యాణ్ రామ్ హిట్ కొడతాడనే నమ్మకంతో ఉన్నాడు.