మైనస్ డిగ్రీల చలిలో బొమ్మాలి

SMTV Desk 2019-02-09 11:11:46  Anushka, Madhavan, Silence,Kona venkat, People media factory

హైదరాబాద్, ఫిబ్రవరి 09: టాలీవుడ్ లో ఎంత మంది కథానాయికలు వచ్చిన అనుష్క స్థానం ప్రత్యేకం. ఇప్పటికి ఆమె తెరపై కనిపించి చాలాకాలమైంది. బాహుబలి సినిమా తర్వాత ఆమె మళ్ళీ తెలుగు తెరపై దర్శనం ఇవ్వలేదు. ప్రస్తుతం అనుష్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆమె ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాన్ని కోన ఫిలిం కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఈ చిత్రం షూటింగ్ విదేశాల్లో జరగనుంది. దీనికోసం కొన్ని లొకేషన్స్ ని చిత్ర బృందం ఎంపిక చేసింది. ఈ ప్రదేశాల్లో ప్రస్తుతం ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలలో ఉందట. అంత చలిలో సైతం షూటింగులో పాల్గొనడానికి అనుష్క అంగీకరించిందని సమాచారం. సైలెన్స్ అనే టైటిల్ ని ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నారు. అనుష్కతో పాటు మాధవన్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించనున్నారు. కొందరు హాలీవుడ్ నటులు కూడా ఈ చిత్రంలో నటించబోతున్నారని సమాచారం. ఈ ఏడాది చివర్లో సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.