సీబీఐ ముందు హాజరుకానున్నా కమిషనర్ రాజీవ్ కుమార్‌

SMTV Desk 2019-02-09 08:49:39  Police Commissioner, Rajiv Kumar, CBI, Sharadha Chit Fund Case, Shillong, Mamatha Banerjee, Supreme Court, Nageshwar Rao

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 09: కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌ శారదా చిట్‌ఫండ్ కుంబకోణం దర్యాప్తు కొరకు నేడు షిల్లాంగ్‌లో సీబీఐ ముందు హాజరు కానున్నారు. విచారనకు సహకరించాలని సుప్రీం ఆదేశం మేరకు రాజీవ్ సీబీఐ అధికారులకు సహకరించనున్నారు. అదేవిధంగా రాజీవ్‌ను అరెస్ట్ చేయరాదని సుప్రీం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

ఈ కేసుకు సంబందించిన ఎలక్ట్రానిక్ ఆధారాలన్నింటినీ సీపీ రాజీవ్ కుమార్ ధ్వంసం చేసే అవకాశం ఉందని సీబీఐ ఆరోపిస్తోంది. ఇదే విషయాన్నీ సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాజీవ్‌ కుమార్‌ను సీబీఐ విచారించడానికి ఒక్కరోజు ముందు నాగేశ్వరరావుకు చెందిన కంపెనీలపై కోల్‌కతా పోలీసులు సోదాలు జరిపారు. దీంతో బెంగాల్ ప్రభుత్వం సీబీఐ పై పగతో ఉందని తెలుస్తుంది.

బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తూ రాజ్యాంగ వ్యవస్థలను స్వార్థ రాజకీయాల కోసం వాడుతోందని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీపీ రాజీవ్ కుమార్‌ను విచారించేందుకు సీబీఐ అధికారులు ఆయన నివాసానికి వెళ్లడం, బెంగాల్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడం, రాత్రికి రాత్రే కేంద్రానికి వ్యతిరేకంగా మమత ధర్నాకు దిగడంతో ఒక్కసారిగా రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. సుప్రీమ్ కోర్ట్ జోక్యంతో మమత ఎట్టకేలకు దీక్ష విరమించరూ కానీ, రాజీవ్ విచారణను ఎదుర్కోవడం మాత్రం తప్పలేదు. ఇప్పుడు శారదా చిట్ ఫండ్ కుంబకోణంకు సంబంధించి రాజీవ్ కుమార్‌ను సీబీఐ ఏ ప్రశ్నలు అడగబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది.