బ్రెజిల్ ఫుట్ బాల్ క్లబ్ లో ఘోర ప్రమాదం ... చిన్నారి క్రీడాకారులు సజీవ దహనం

SMTV Desk 2019-02-09 08:05:05  Brazil, football club, fire accident, flemingo football club, football match,, killed 10 people and injured

బ్రెజిల్ లోని ఓ ఫుట్‌బాల్ క్లబ్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పది మంది చిన్నారులు సజీవ దహనమయ్యారు. వీరందరూ పది నుంచి 16 ఏళ్ల లోపు వారే.
రియో డి జెనీరోలోనే అత్యంత పెద్దదైన ఫ్లెమింగో ఫుట్‌బాల్ క్లబ్‌లో ఈ దారుణం జరిగింది. క్లబ్‌లోని డార్మిటరీలోఫుట్ బాల్ క్రీడాకారులు నిద్రిస్తున్న వేళ మంటలు చెలరేగాయి. పడుకున్న వారి చుట్టూ మంటలు త్వరగా వ్యాపించడం తో వారు ఆ ప్రమాదం నుండి తప్పించుకోడానికి వీలు లేకుండా పోయింది దానితో ఆ చిన్నారి క్రీడాకారులు ఆ భారి ఎత్తున ఎగిసిన మంటలను ఆహుతి అయ్యారు. వీరిలో ఒక ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
ఫ్లెమింగో ఫుట్‌బాల్ క్లబ్‌కీ, మరో జట్టుకి మధ్య నేడు మ్యాచ్ జరగాల్సి ఉండగా అంతలోనే ఈ ఘటన జరగడంతో అందరూ షాక్‌కు గురయ్యారు.
విషయం తెలిసిన గవర్నర్ విల్సన్ మూడు రోజులపాటు సంతాప దినాలు ప్రకటించారు.