బీఎండబ్ల్యూ బైక్ కొన్న మాజీ కెప్టెన్

SMTV Desk 2019-02-08 19:57:57  Sourav ganguly, Team india, BMW Bike

కోల్‌కతా, ఫిబ్రవరి 08: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. బీఎండబ్ల్యూ జీఎస్‌ 310 ట్విన్స్‌ బైక్‌ను కొన్నాడు. బెంగాల్ టైగర్ గంగూలీకి ఇటీవలే ఆ బైక్‌ను డెలివరీ చేశారు. ఈ బైక్ ఖరీదు 3.49 లక్షలు(ఎక్స్ షోరూమ్‌). కోల్‌కతా షోరూమ్‌లో సౌరవ్ దాదా బైక్‌ను రిసీవ్ చేసుకున్నాడు. బీఎండబ్ల్యూ సోషల్ మీడియా అకౌంట్‌లో గంగూలీ ఫోటోలను పోస్టు చేశారు.

గత ఏడాది మరో క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా ఈ బైక్‌ను ఖరీదు చేశాడు. అతను బీఎండబ్ల్యూ 310ఆర్ వర్షన్‌ను కొన్నాడు. 1990 దశకంలో హీరో బైక్‌ల యాడ్స్‌లో గంగూలీ నటించేవాడు.