కుర్రకారుని వేడెక్కిస్తున్న లక్ష్మీ రాయ్...

SMTV Desk 2019-02-08 19:46:54  Lakshmi rai, Where is venkata lakshmi, Khaidhi No 150, Gym pics

హైదరాబాద్, ఫిబ్రవరి 08: ఖైదీ నెం 150 లో చిరు సరసన ఐటెం సాంగ్ లో మెరిసిన కన్నడ బ్యూటి లక్ష్మీ రాయ్. ఈ బ్యూటి ప్రస్తుతం తెలుగులో వేర్ ఈజ్ వెంకటలక్ష్మి అనే సినిమాలో నటిస్తుంది. అయితే ఈ హీరోయిన్ అందంలో అప్డేట్ అవుతూ కుర్రకారును ఆకర్షిస్తూ ఉంటుంది. రీసెంట్ గా ఈ బ్యూటీ జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ కెమెరాకు ఇలా స్టిల్స్ ఇచ్చింది. మూడు పదుల వయసొచ్చినా అందంలో ఇంకా కుర్ర హీరోయిన్స్ కి గట్టి పోటీని ఇవ్వడానికి ఈ హాటీ సిద్ధంగా ఉందని జనాలు కామెంట్స్ చేస్తున్నారు. అయితే లక్ష్మి రాయ్ బ్యాడ్ లక్ ఏమిటో గాని కెరీర్ ఎప్పుడూ కూడా ఒక లెవెల్లో నడవలేదు,.

సౌత్ లో అన్ని భాషలను కవర్ చేసింది. ఐటెమ్ సాంగ్స్ తో కూడా రచ్చ బాగానే చేసినా ఆ సాంగ్స్ క్లిక్ అయ్యాయి గాని స్టార్ హీరోలతో నటించే అవకాశం మాత్రం రావడం లేదు. పరిస్థితులు ఎలా ఉన్నా కూడా లక్ష్మి అందాన్ని కాపాడుకోవడంలో ఏ మాత్రం తగ్గడం లేదు. భవిష్యత్తులో అయినా మంచి అవకాశాలు వస్తాయోమో చూడాలి.