ఇంకా పట్టాలెక్కని నితిన్ 'భీష్మ'....

SMTV Desk 2019-02-08 18:38:08  NIthin, Bheeshma movie, Chal mohan ranga, Lie, Srinivasakalyanam, Chalo, Venkey kudumula director

హైదరాబాద్, ఫిబ్రవరి 08: లై , ఛల్ మోహన రంగ , శ్రీనివాసకళ్యాణం వంటి వరుస పరాజయాలపాలైన సినిమాలతో ముందుకేల్తున్నాడు నితిన్. అయితే కొద్ది రోజుల క్రితం నితిన్ ఛలో ఫేం దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్ లో ఓ సినిమా చేయాలనుకున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మించాల్సివుంది. దీనికి భీష్మ అనే టైటిల్ కూడా పెట్టారు. కథ కూడా సిద్ధంగా ఉంది. కానీ ఇప్పటివరకు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. దానికి కారణం ఏంటని ఆరా తీయగా.. రెమ్యునరేషన్ దగ్గర రాజీ కుదరడం లేదని సమాచారం. భీష్మ నిర్మాణ సంస్థ నితిన్ ని రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని అడిగారట. కానీ నితిన్ మాత్రం లై సినిమాకు ముందు ఈ బ్యానర్ లో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. దీంతో ఆ సమయంలో అనుకున్న రెమ్యునరేషనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడట.

కానీ నిర్మాతలు మాత్రం పారితోషికం తగ్గించుకోవాలని అడుగుతున్నారట. ఈ విషయంలో హీరో, నిర్మాతలకు రాజీ కుదరని కారణంగానే సినిమాను ఇంకా సెట్స్ పైక్లి తీసుకువెళ్లలేదని అంటున్నారు. మరోపక్క ఎంతసేపటికి ఈ సినిమా షూటింగ్ మొదలుకాకపోవడంతో సినిమా కోసం కాల్షీట్స్ కేటాయించిన హీరోయిన్ రష్మిక ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాలని చూస్తుందట. ఈ సినిమాకి బదులు అల్లు అర్జున్ సినిమా చేయాలని చూస్తోంది. ఆ సినిమాను నిర్మించేది కూడా సితార ఎంటర్టైన్మెంట్స్ వారే కాబట్టి ఈ విషయంలో రష్మిక పెద్దగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పని ఉండదు.