విలేజ్ బ్యాక్ డ్రాప్ కథలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్న దేవసేన...

SMTV Desk 2019-02-08 18:26:42  Anushka, Arundhati movie, Bhagamathi movie, kona venkat

హైదరాబాద్, ఫిబ్రవరి 08: టాలీవుడ్ గ్లామరస్ బ్యూటి అనుష్క రేంజ్ స్టార్ హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా ఉంది. అరుంధతి సినిమా నుండి లేడీ ఓరియంటెడ్ సినిమాలు స్టార్ట్ చేసిన ఈ అమ్మడు ఇప్పటికీ చేస్తూనే వుంది. ఈ మధ్య వచ్చిన బాగమతి అనంతరం ఎక్కువగా అనుష్క దగ్గరికి హారర్ కథలే వస్తున్నాయట. అదే జానర్ కు చెందిన సైలెన్స్ అనే సినిమాను ఒకే చేసిన అనుష్క గత ఏడాది నుంచి విన్న 20 కథల్లో 15కు పైగా దెయ్యాల కథలే వచ్చినట్లు టాక్. బాహుబలి అనంతరం క్రేజ్ తో పాటు బిజినెస్ కూడా పెరిగింది.

వయసు నాలుగు పదుల్లోకి వచ్చేసరికి వీలైనంత వరకు డిఫరెంట్ సినిమాలను చేయాలనీ బేబీ భావిస్తోందట. అందుకే స్పోర్ట్స్ డ్రామా విలేజ్ బ్యాక్ డ్రాప్ కథలు వస్తే వినడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు సమాచారం. కుదిరితే ఓ బయోపిక్ లో నటించాలని కూడా అనుష్క ఆలోచిస్తుందట. ప్రస్తుతానికైతే అనుష్క కోన వెంకట్ సారథ్యంలో సైలెన్స్ సినిమాతో బిజీగా ఉంది. ఓ రెండు మూడు కథలను వెయిటింగ్ లిస్ట్ లో పెట్టినట్లు సమాచారం.